చేయిస్తున్న హామీని నిలబెట్టుకోవాలని వినతి పత్రం ఇచ్చిన కౌన్సిలర్లు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలో గత నెల 22-2-2023 బుధవారం స్థానిక శాసనసభ్యులు పైల్ల శేఖర్ రెడ్డి 25,24,23,22,21 వార్డులలో ఉదయం ఆరు గంటల నుండి పర్యటనలు నిర్వహించి వార్డులలో నెలకొన్న ప్రధాన సమస్యలు గుర్తించి మురికి కాల్వల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మరికొన్ని చోట్ల అంతర్గత మురికి కాల్వల నిర్మాణం చేస్తామని మరియు మురికి కాల్వలపై స్లాబులు, సీసీ రోడ్లు నిర్మాణం వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి నేటి వరకు కూడా పనులు ప్రారంభించలేదని ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి గారికి కౌన్సిలర్లు మాయ దశరథ,రత్నపురం బలరాం పడిగెల రేణుక ప్రదీప్ ఉదయగిరి విజయకుమార్ గార్లు వినతిపత్రం సమర్పించి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డుల పర్యటన నిర్వహించి వెన్ను వెంటనే వార్డులలో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని అంతర్గత మురికి కాల్వ నిర్మాణం స్లాబులు సిసి రోడ్ల నిర్మాణం విద్యుత్ స్తంభాలు వార్డు కావలసిన మౌలిక వసతులు వెంటనే కల్పిస్తామని పర్యటన నిర్వహించి నేటికీ 20 రోజులు గడుస్తున్న కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లుగా ఎమ్మెల్యే గారి హామీ ఉన్నదని సమస్యలను గుర్తించిన చోట పనులు చేయించకుండా మరొకచోట పనులు చేయించడం విడ్డూరమని కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం టిఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షించడం కోసమే వార్డు పర్యటన చేశారు తప్ప గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని కనీసం గుర్తించిన సమస్యల పనులకు కావలసిన ఎస్టిమేషన్ లు వెయ్యలేదని అన్నారు టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో చేస్తున్న పనులు కూడా వార్డులలో ఇప్పటివరకు కూడా పూర్తికాగా కాలేదు అసంపూర్తిగా పనులు చేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా మీ పర్యటనలో గుర్తించిన వార్డులకు కావలసిన కనీస మౌలిక వసతులను కల్పించాలని కోరడం జరిగింది.




