Thursday, 5 November 2026

స‌భా ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించిన ఠాక్రే

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే గురువారం సాయంత్రం మంచిర్యాల్లోని స‌త్యాగ్ర‌హ స‌భ ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించారు. స‌భా ప్రాంగ‌ణం గురించి అక్క‌డున్న స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌తో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి ప్ర‌త్యేకంగా అడిగి తెలుసుకున్నారు. స‌భ‌కు వ‌చ్చే కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌ల‌కు భోజ‌నం, ఎండ ఎక్కువ‌గా ఉండ‌డంతో తాగేందుకు మంచినీళ్లు, మ‌జ్జిగ వంటి వాటిని ఏర్పాటు చేశారా? అని ప్ర‌త్యేంగా ఆరా తీశారు. లక్ష మందితో నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆయ‌న స్థానిక నాయ‌క‌లకు సూచించారు.