జనంసాక్షి , మంథని : పెద్దపెల్లి జిల్లా మంథనిలో అంబేద్కర్ సంఘం భవనానికి రూ. 10 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ని ఆదివారం మంథని లోని తన నివాసంలో అంబేద్కర్ సంఘం నాయకులు నక్క రవి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




