జనం సాక్షి , మంథని : మంథని మండలం గుంజపడుగు గ్రామంలో 11న మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు గ్రామంలో మహాత్మా జ్యోతరావు పూలే, డా “బి ఆర్ అంబేథ్కర్ విగ్రహాల ను జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆవిష్కరణ చేస్తారని దేవల్ల విజయ కుమార్, బోగే తిరుపతి తెలిపారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, ఎంపీటీసీలు, దళిత నాయకులు బహుజనులు, అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బోగే విజయ కుమార్, అక్కపాక శేకర్, పసుల నర్సింగ్, బోగె మల్లేష్, కాసిపేట సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు గుంజపడుగులో మహాత్మా జ్యోతరావు పూలే, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ




