జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ రేణు హాస్పిటల్ లో పోచమ్మ వాడకు చెందిన నరెడ్ల రవి కి కాలు ఫ్యాక్చర్ కాగా వారిని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి ,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.




