బచ్చన్నపేట (జనం సాక్షి):జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య బచ్చన్నపేట మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థుల పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు వసతులు ఎలా ఉన్నాయని ఎవరైనా సెల్ ఫోన్ తీసుకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని ప్రధానోపాధ్యాయులను అడిగారు. జనగామ జిల్లా డీఈవో రాము కలెక్టర్ వెంట ఉన్నారు




