-ప్రజలకు,కార్మికులకు,కులసంఘాలకు, వృత్తి సంఘాలకు పిలుపు జనంసాక్షి, మంథని :
భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ని పురస్కరించుకుని ఈనెల 14న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా మంథని లోని గాంధీ చౌక్ లో నిర్వహించే జయంతి సభను మంథని ప్రాంత ప్రజలు విజయవంతం చేయాలని డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. మంథని ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జయంతి ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ… గత సంప్రదాయానికి భిన్నంగా అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన నేతగా భావించి అందరిని భాగస్వామ్యులుగా చేయాలని భావించి జయంతి ఉత్సవ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ మారు ఘనంగా జయంతి ఉత్సవాలను పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి మంథని లోని గాంధీ చౌక్ లో 14న ఉదయం 10 గంటలకు సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో మంథని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ -2023 చైర్మన్ ఇనుముల సతీష్, కమిటీ కన్వీనర్లు సెగ్గెం రాజేష్, పోతరబోయిన క్రాంతి, బూడిద గణేష్, బూడిద తిరుపతి, ఆర్ల సందీప్,మంథని లింగయ్య, విరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




