Monday, 2 November 2026

ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసిన వివోఏలు

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గం 7 మండలాల ఎస్ ఇ ఆర్ పి వివో ఏ లు తమ సమస్యల పై స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని సోమవారం క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసిన వివోఏలు తాము 17 సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో పేద నిరుపేదల మహిళల పక్షాన పనిచేస్తున్నామని, అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని, అవగాహన కల్పిస్తున్నాం కానీ తమకు అత్యంత తక్కువ గౌరవ వేతనాలు ఇస్తున్నారని, ఇటీవల ఇంకా పని ఒత్తిడి పెరిగి మొత్తం ఆన్లైన్ ద్వారానే పనులు జరుగుతున్నాయని క్షేత్రస్థాయిలో పని ఒత్తిడి బాగా పెరిగినందున గౌరవ వేతనాన్ని పెంచి తమ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని వివో ఏలు ఎమ్మెల్యేని కోరడం జరిగింది. ఇటీవల అకాల మరణానికి గురైన గరిడేపల్లి మండలం కొత్తగూడెం సతీష్ భార్యకు వివోఏ గా అవకాశాన్ని కల్పిస్తున్నామని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ వివోల గౌరవ వేతనం పెంపు ప్రభుత్వ దృష్టిలో ఉందని త్వరలోనే తీపి కబురు అందుతుందని ఈ విషయం పై సీఎం కెసిఆర్ తో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఏడు మండలాల ఎస్ ఈ ఆర్ పి వివో ఏ ల నాయకులు పాల్గొనడం జరిగింది