ఎమ్మెల్యే హరిప్రియను కలిసిన సులానగర్ యూత్
టేకులపల్లి, జనవరి 2 (జనం సాక్షి): ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ ను టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి బొకేలను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బోడ రమేష్ నాయక్, కుమ్మరి కిరణ్, ఉండేటి ఇరిమియా, కొట్టే సురేష్, కొప్పుల సురేష్, గ్యార పృథ్వి, కుమ్మరి చౌదరి,మీసాల కమలాకర్, కే లోతు రాంకుమార్, కాలే పండు, ఇళంగి రవి, జంగం ఎలేషా తదితరులు పాల్గొన్నారు.




