ఘనంగా డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య జన్మదిన వేడుకలు
టేకులపల్లి, జనవరి 2( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య జన్మదిన వేడుకలు లను టేకులపల్లి మండల కాంగ్రెస్పార్టీ కార్యాలయం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ ఆధ్వర్యంలో సోమవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కో- ఆర్డ్రనేటర్ భూక్య చంద్రకళ, మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, యువజన కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దంతోజు నవీన్ కుమార్, టేకులపల్లి మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్యానాయక్, గంగారం మాజీ సర్పంచ్ వీసం శ్రీనివాసరావు,ఈసం ప్రసాద్,భూక్యా రవీందర్ సింగ్,భూక్య బన్సీలాల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోతు సరిలాల్,భూక్య ధర్మ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల అరెస్టు విడుదల :
స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు పొదేం వీరయ్య జన్మదిన వేడుకలను జరుపుతుండగా స్థానిక పోలీసులు నాయకులందరినీ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి, అనంతరం విడుదల చేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.




