ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో చేరిన కాంగ్రెస్ నాయకులు
టేకులపల్లి,నవంబర్ 19( జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎనుగంటి అర్జునరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రవికాంత్ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ సమక్షంలో ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం టిఆర్ఎస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్ ,ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ ,యూత్ అధ్యక్షులు శివకృష్ణ నాయక్, దాస్ తండా ఎంపీటీసీ భూక్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




