టేకులపల్లి, ఏప్రిల్ 12( జనం సాక్షి): టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామపంచాయతీలో వివిధ పార్టీల నుంచి 300 కుటుంబాలు ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. బుధవారం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని బేతంపూడి దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో బేతంపూడి గ్రామపంచాయతీ నుంచి వివిధ గ్రామాలకు చెందిన 300 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కృషితో జరుగుతున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల పట్ల ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నట్లు వారంతా తెలిపారు. వారిని ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే హరిప్రియను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధా, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, నాయకులు బానోత్ రామ నాయక్, బానోత్ కిషన్ నాయక్, లక్కినేని శ్యామ్, బర్మావత్ శివకృష్ణ , బానోత్ రవి నాయక్, జాటోత్ నరేష్ నాయక్, భూక్య పాపా నాయక్,బానోత్ నాగేందర్ నాయక్, ఇస్లావత్ బాలు, ,గూగులోత్ కృష్ణ, బుక్య సైదులు, తదితరులు పాల్గొన్నారు.




