హుజూర్ నగర్ ఏప్రిల్ 12 (జనంసాక్షి): టి ఎస్ పి ఎస్ సి, 10వ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఘటనలో సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం జన సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుసగా పేపర్ల లీకేజీలు జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండబట్టే కేసీఆర్ మౌనంగా ఉన్నాడని విమర్శించారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పేపర్ల లీకేజీ వలన నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రావణ్ కుమార్, బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ రాపోలు నవీన్, నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లగాని సుబ్బు గౌడ్, టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి , హుజూర్ నగర్ టిడిపి టౌన్ పార్టీ కన్వీనర్ కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , జన సమితి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షం నాయక్, ఐఎన్టీయూసీ , పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి చందర్రావు, నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
పేపర్ల లీకేజీ లో సిబిఐ విచారణకు కేసిఆర్ ఆదేశించాలి – టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు డిమాండ్




