ఎమ్మెల్యే హరిప్రియ స్వగృహంలో అయ్యప్ప స్వామి పూజ
టేకులపల్లి, డిసెంబర్ 31( జనం సాక్షి): ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ టేకులపల్లి మండలంలోని వారి స్వగృహమైన దాస్ తండాలో శనివారం అయ్యప్ప స్వామి దీక్షపరులు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల పూజ లో ఎమ్మెల్యే హరిప్రియ హరసింగ్ నాయక్ స్వామి దంపతులు పూజలు ప్రారంభించారు. అనంతరం స్వాములకు దీక్ష తీర్థ ప్రసాదం, దీక్ష భిక్ష భోజనాలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి పూజలో గురుస్వాములు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ ,బానోత్ రామ నాయక్, బానోత్ కిషన్ నాయక్, సర్పంచులు మాలోతు సురేందర్, భూక్య పాపా నాయక్, బర్మవత్ శివకృష్ణ, కాలే ప్రసాదరావు, బానోతు రవి,జరుపుల లచ్చు, అంతోటి రాకేష్, కాలే అభినయ్, రంగా , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




