కోటగిరి మే 9 జనం సాక్షి:-వైద్యుల సూచనల మేరకు ఇటీవల కాలు గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ బాన్సువాడ నియోజక వర్గ శాఖ ఆధ్వర్యంలో సైద రాజుల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని సైదరాజులు గందాల్ ఉత్సవాలలో భాగంగా సోమవారం టిజేఎస్ఎఫ్,ఉ మ్మడి కోటగిరి మండల నాయకులు,కాలి గాయంతో విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం త్వరగా కుదుటపడి ప్రజా క్షేత్రంలో మరల తిరిగి రావాలని కోరుతూ వారు సయ్యద్ హజరత్ హుస్సేన్ బాబాకు చాదర్ సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.అనునిత్యం ప్రజల కోసం పనిచేసే ప్రజా నా యకురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ ఆరోగ్యంతో కాలు గాయం నుండి త్వరగా కోలుకోవాలని,ఆ బా బా ఆశీస్సులు ఆమెపై ఎల్లవేళల ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు.కవిత త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆమె అభిమానులుగా వా రు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిజేఎస్ఎఫ్ బాన్సువాడ నియోజక వర్గ కన్వీనర్ ఎం.డి నవీద్,ఉమ్మడి కోటగిరి మండల బి.అర్.ఎస్. పార్టీ అధ్యక్షులు ఏజాజ్ ఖాన్,మార్కెట్ కమిటీ చైర్మ న్ అబ్దుల్ హమీద్,బి.అర్.ఎస్ నాయకులు జుబేర్, బాబు ఖాన్,ఎజాస్,జునేద్,మైనారిటి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




