బిచ్కుంద మే 08 (జనంసాక్షి)రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సోమవారం నాడు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బిచ్కుంద చైర్మన్ కోలావార్ కుమార్ సేట్, వైస్ చైర్మన్ రచ్చ శివకాంత్, డివిజన్ సభ్యులు డాక్టర్ నర్సింహులు, హుండే బస్వరాజ్, సభ్యులు వెంకటరమణ, హన్మగౌడ్, సంతోష్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




