Sunday, 8 November 2026

ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ను కలిసిన నియోజకవర్గ మత్స్యకారులు

ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ను కలిసిన నియోజకవర్గ మత్స్యకారులు.
-మత్స్యకారులపై జరుగుతున్న దాడులను వివరించిన నాయకులు.
– భరోసా కల్పించిన బండ ప్రకాష్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్26(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ నియోజకవర్గ మత్స్య సహకార సంఘాల నాయకులు సోమవారం హైదరాబాద్ లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ను మర్యాద పూర్వకంగా కలువడం జరిగిందని నాగర్ కర్నూల్ మండల మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు గూళ్ళ హరికృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తో నాగర్ కర్నూల్ నియోజకవర్గ చెరువులు, కుంటలు, రిజర్వాయర్ లపై అగ్రకులాల దాడులు చేసిన సంఘటన ల పై వివరించామని అన్నారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘం అధ్యక్షుడు గూళ్ళ హరికృష్ణ మరియు బిజినపల్లి మండల అధ్యక్షుడు తుమ్మల అల్లోజీ మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి బచ్చలి బంగారయ్య లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని చెరువులు,కుంటలు, రిజర్వాయర్ లపై అగ్రకులాల వారు మరియు ఇతర కులస్తులతో కలిసి మత్స్య సంపద ను లూటీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం పై ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కు వివరంగా విన్నవించినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి కేసిఆర్ కులవృత్తులకు చేయుత నిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి మత్స్య కారుల కు ఉచిత చేప పిల్లలను అందజేస్తుంటే, అగ్రకులాలు చెరువు కుంటల పై దాడులు చేసి మత్స్య సంపద ను లూటీ చేస్తున్నారని విమర్శించారు. మత్స్య కారుల హుక్కు చేపలు పట్టే వృత్తి కానీ ప్రభుత్వ జీవో లను తుంగలో తొక్కి కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తెనుగు మత్స్య కులాల హక్కులను భంగం కలిగిస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘాల నాయకులతో ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధి కి తోడ్పడుతానని అన్నారు. చెరువే మన జీవనాధారం చెరువు కుంటల రిజర్వాయర్ లపై పూర్తి హుక్కులు తెనుగు మత్స్య కారులకే ఉంటుందని తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య శాఖ ఏడీ లక్ష్మప్ప కు చరవాణిద్వారా నాగర్ కర్నూల్ జిల్లా లో మత్స్య సహాకార సంఘాల లో 18 ఏళ్లు నిండిన మత్స్య కారుల కీ సభ్యత్వాలను మార్కెటింగ్ సొసైటీ ద్వారా సభ్యత్వాలను ఇవ్వాలని కోరారని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 100 శాతం సభ్యత్వాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి మత్స్య కారుడికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను వర్తింప చేయాలని కోరారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ పై అగ్రకులాల వారు మరియు ఇతర కులస్తులు మత్స్య సంపద ను లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీ లక్ష్మప్ప కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మత్స్య సహాకార సంఘాల నాయకులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏడీ కి సూచించారని అన్నారు..ఈ దాడుల పై ప్రగతి భవన్ లో ముఖ్య మంత్రి కేసిఆర్ దృష్టి కీ తీసుకోని వెళ్తానని మత్స్యకారులకీ హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల కమిటీ ఉపాధ్యక్షుడు కొరుపాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎర్రవోలు మహేష్, ప్రచార కార్యదర్శి కొండమోని భీమయ్య, కమిటీ సభ్యులు జాజల రాములు, నాగర్ కర్నూల్ చెరువు సొసైటీ అధ్యక్షుడు బచ్చలి వెంకటయ్య, శ్రీపురం సొసైటీ అధ్యక్షుడు కొండమోని వెంకటయ్య, గగ్గలపల్లి సొసైటీ అధ్యక్షుడు చాపల సాయిలు ,
బిజినపల్లి మండలం ఖానాపూర్ సొసైటీ అధ్యక్షుడు బంగారయ్య, బాలస్వామి, జంగయ్య, తిరుపతయ్య, అంజి, శ్రీను, ఈశ్వర్, గంటా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.