కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు.
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపు
మిర్యాలగూడ, జనం సాక్షి :కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు సన్నద్దమ్ కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, తెలంగాణ రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు .ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీ సాగర్ , జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, రైతుల రుణాలన్నీ ఏక కాలంలో రుణమాఫీ చేయాలని, పేద రైతులు వ్యవసాయ కూలీలు చేతి వృత్తుల వారికి నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. జనవరి 8న హైదరాబాదులో రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 26న దేశవ్యాప్త పిలుపులో భాగంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని,కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సంఘం జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహా కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, రాం రెడ్డి, చేపల మారయ్య, వెంకటరెడ్డి, ముత్తి లింగం శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమణారెడ్డి, మంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు




