పెళ్లిని నిలిపిన పోలీసులు…యువకుడిపై కేసు
వరంగల్, ఫిబ్రవరి 6 : ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి సిద్ధపడ్డ ఓ వ్యక్తికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. జిల్లాలోని శామూన్‌పేటకు చెందిన రాజశేఖర్‌కు అనంతసాగర్‌కు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. నిన్న(గురువారం)ఉదయం వీరిరువురి వివాహం జరగాల్సి ఉంది. కాగా అదే సమయానికి రాజశేఖర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ చివరి స్టేజ్‌కు చేరుకున్నట్టుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 20 నిమిషాల ముందు పెళ్లిని నిలిపివేశారు. విషయం తెలిసిన వధువు బంధువులు అవాక్కయ్యారు. కరుణ మైత్రి, స్నేహ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమాచారం మేరకే తాము ఇక్కడి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా రాజశేఖర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అప్పటి నుంచి తరచూ మందులు తీసుకుంటున్న రాజశేఖర్ గత పదిహేనురోజులుగా రాకపోవడంతో అనుమానంతో సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపివేసి వరుడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి సందర్భంగా వరుడికి వధువు కుటుంబం భారీగా కట్నాన్ని ముట్టజొప్పింది. అయితే అసలు విషయం బయటపడటంతో వధువు తరపు తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.




