ఫొటో : కళాజాత నిర్వహిస్తున్న కళాకారులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 7, (జనంసాక్షి )
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో న్యాకో సంస్థ సహకారంతో మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో ఎయిడ్స్ నియంత్రణకై కళాజాత నిర్వహించారు. హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అరక్షిత లైంగిక సంబంధాలు చేయరాదని, ఎయిడ్స్ కు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని కళాకారులు కళారూపం ద్వారా ప్రదర్శన నిర్వహించారు. ఈకార్యక్రమంలో టీం లీడర్ సురుపంగ గణేష్, శంకర్, కోట ఆదిత్య, భాగ్యలక్ష్మి, గణేష్, లింక్ సూపర్వైజర్ శ్రీధర్, ఎన్జిఓలు పాల్గొన్నారు.




