భైంసా రూరల్ ఫిబ్రవరి 08 జనం సాక్షిభైంసా, అరే మరాఠా సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మంగళవారం భైంసాలోని నర్సింహ కళ్యాణ మండపంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షెట్పల్లి శివాజీ పాటిల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఇందులో అధ్యక్షులుగా జేకే సుదర్శన్ పాటిల్, ప్రధాన కార్యదర్శిగా పుండలీక్ రావ్ పాటిల్, ఉపాధ్యక్షులుగా నాగేందర్ పాటిల్, మాదవ్ రావ్ మోరే, కోశాధికారిగా లింగురామ్ పాటిల్ లు ఏకగీవ్రంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు జేకే సుదర్శన్ పాటిల్ మాట్లాడుతూ.. సంఘ పెద్దలు, సభ్యుల సమన్వయం సహకారంతో జిల్లాలో అరే మరాఠా సంఘ బలోపేతానికి అంకితభావంతో పాటుపడుతానన్నారు. అందరి సలహాలు, సూచనలు పరిగణ లోకి తీసుకొని సంఘాన్ని పటిష్టపరుస్తానన్నారు. సమన్వయం, సమిష్టి కృషితో అరే మరాఠా సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు




