జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మిరల రాజు ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోగా సంఘటన స్థలాన్ని చూసి వారి కుటుంబాన్ని పరామర్శించి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెమినీ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూoపల్లి రాజయ్య, గ్రామ సర్పంచ్ కట్కం రవీందర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి పెండ్యాల రాజు,గ్రామ శాఖ అధ్యక్షుడు కోల నరేందర్,కోలా నర్సయ్య గౌడ్, కోల మల్లయ్య,గుమ్మడి రాజు ,వడ్లకొండ అభి ,గాండ్ల రాజయ్య,భద్రపు శంకరయ్య, ఎండి సాబీర్, సంతోష్,మారుతి ఉన్నారు.




