ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి దిలీప్ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి దిలీప్
జనం సాక్షి, చెన్నరావు పేట
ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి దిలీప్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు అవగాహన కలిగి వుండాలని, కొంత మంది ప్రజలు ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేపించుకోవటానికి ముందుకు రావటం లేదన్నారు.విద్యావంతులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేపించుకోవలని సూచించారు. వ్యాధిగ్రస్తులు సమయానికి మందులు వేసుకోవటంతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల జీవిత కాలం పెంచుకోవచ్చని అన్నారు.వ్యాధిగ్రస్తులను అంటరాని వారిగా చూడకుండా మనోధైర్యం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గురిజాల పల్లె దవాఖాన వైద్యురాలు సుమ,సి హెచ్ ఓ వెంకటేశ్వర్లు, స్వరూప రాణి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి




