Monday, 2 November 2026

గుత్తి కోయలపై కేసులు అప్రజ స్వామికంగుత్తి కోయలపై కేసులు అప్రజ స్వామికం

గుత్తి కోయలపై కేసులు అప్రజ స్వామికంగుత్తి కోయలపై కేసులు అప్రజ స్వామికం
రేంజర్ శ్రీనివాస్ రావు సంఘటన అనుకోకుండా జరిగింది.
గోత్తికోయలు అమాయక ప్రజలు
టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్
జనం సాక్షి,నర్సంపేట
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  శ్రీనివాస రావు ది హత్య కాదని, అనుకోకుండా జరిగిన సంఘటన అని, టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 22న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు ది హత్య జరిగిందని సమాచారం మేరకు మేము 24న సంఘటన జరిగిన స్థలానికి పోయి పరిశీలించడం జరిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చంద్రుగొండ మండలం బొందలపాడు గ్రామం నుండి ఎర్రబోడు ఆదివాసి గూడెం ఒక కిలోమీటర్ ఉంటుంది. ఎర్రబోడు సీతమ్మ ప్రాజెక్టు కాలువ ఆనుకొని 40 ఆదివాసి కుటుంబాలు 26 సంవత్సరాలుగా  నివాసం ఉంటున్నాయి. సొంత రాష్ట్రంలో పోలీసులతో, మావోయిస్టులతో ఇబ్బందులు అయితే ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు రెండు మూడు ఎకరాలు చొప్పున సాగు చేసుకుంటున్నారు. మీరు సాగు చేసింది దాంట్లోకెల్లి 30 ఎకరాలు మొక్కలు పెట్టిన వీరు ఫారెస్ట్ వారు ప్లాంటేషన్ చేసిన ఏమనలేదు. ఈనెల 22న రేంజర్ శ్రీనివాసరావు సెక్షన్ ఆఫీసర్ తేజ రాములతో కలిసి బొందలపాడు గ్రామం కు వెళ్లారు. ప్లాంటేషన్ పక్కన తులా అనే ఆదివాసి తన బర్రెలను మేపుతున్నాడు.ఇది గమనించిన శ్రీనివాసరావు నువ్వు ప్లాంటేషన్ లోనే మేపు, ప్లాంటేషన్ లోకి పంపి అని చెప్పి అతనితో అంటే సార్, తప్పు నేను అందులో ఎలా మేపుతానని, మేపను అని అంటే నాకే ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి అతనిపై ఎదురు దాడి చేసి అతన్ని కొట్టడం ప్రారంభించాడు. ఇతని అరుపులు విని ఏమైందేమో అని ఇతను దగ్గరికి వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనబడేసరికి ఏంటి సార్ కొడుతున్నావు అని ప్రశ్నించేసరికే నన్నే ప్రశ్నిస్తున్నావా నీ సంగతి చూస్త , అతను కొట్టడం మొదలెట్టసరికే అతను అనుకోకుండా చేతులను గొడ్డలి అడ్డుగా పెట్టేసరికి అతని ప్రాణం తీసింది దీనిలో గుత్తికోయలు కావల్సుకొని చంపినట్టు, పథకం ప్రకారం చేసినట్టు ఐపీసీ 3002 34 సెక్షన్లు పెట్టి వారి అరెస్టు చూపెట్టారు. వాస్తవాన్ని వక్రీకరించి పోలీసులు శిక్షలు పెట్టడం చట్టవిరుద్దం, ఏ పోలీస్ అధికారైతే తప్పుడు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశాడో, ఆ అధికారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీజేఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుతున్నాం. వారిమీద పథకం ప్రకారమే సీఎం ఆదేశాల మేరకు కేసు పెట్టారని తెలిపారు. వాస్తవాలను పరిశీలించాలని కోరారు. 2005 డిసెంబర్ 11న ఏ చట్టం అయితే వచ్చిందో ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం సందు దొరికినప్పుడల్లా చట్టాన్ని అమలు చేయకుండా, నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పుడు ఈ సంఘటన సాకు చూపి పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా నాన్చడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అమాయక గుత్తి కోయిలపై ప్రభుత్వం ప్రతాపం చూపెట్టడంతో తెలంగాణలో 30 వేల పైచీలకు ఉన్న గుత్తి కోయిలకు కాలీ చేయాలనీ నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం. నోటీసులు ఇచ్చే అధికారం వీరికి ఎక్కడిది, వీరు వారి హక్కులను కాలరాస్తున్నారనీ, ప్రజల కోసం కొట్లాడే ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఎర్రబోడుకు వెళ్లి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని, ఎవరో చెప్పింది వినకుండా అక్కడికి వెళ్లి నిజనిర్ధారణ చేసి ఎవ్వరు లేని గుత్తి కోయల పక్షాన నిజం మాట్లాడండి అని పిలుపునిచ్చారు. పోడు భూముల హక్కు చట్టం 2005లో వచ్చిన ఇప్పటివరకు ఎందుకు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వట్లేదు ఎందుకు నాస్తున్నారు చెప్పాల్సింది ప్రభుత్వమేనన్నారు. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి తెలుసుకోవడానికి పాదయాత్ర ఎంతగానో పార్టీలకు ఉపయోగపడతాయి. రాజకీయాలలో మత రాజకీయాల్లో కుల రాజకీయాలు హత్య రాజకీయాలు కు అవకాశమే ఉండదు. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయం ఉండాలి. పార్టీలు, పార్టీ నాయకులు ఎవరైనా సరే అనుపార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంది, అటువంటి సందర్భంలో చట్టప్రకారం పోకుండా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం మరి ఈ అధికార పార్టీ నాయకులకు చట్టాన్ని తీసుకుని హక్కు ఎవరు ఇచ్చారు. కేటీఆర్ సూచనలతోనే, పెద్ది సూచనలతో టిఆర్ఎస్ నాయకులు షర్మిలను అడ్డగించడం, ఆమె వాహనాలను తగలబెట్టడానికి ప్రయత్నించడం, ఉద్యమ పాఠ్యం చెప్పుకొని తెలంగాణలోకి అధికారులకు వచ్చి తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేక మిగతా రాజకీయ పక్షాలు చెబుతుంటే ఉరువలేక దాడులు చేయడం ఇదేనా మీ సంస్కృతి అని ప్రశ్నించారు. ఓట్ల సమయంలో అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి మద్యమిచ్చి ఓట్లు ఎంచుకొని గెలవడం కాదు ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం నీచ రాజకీయాలు మానుకోవాలి భూములపై కన్నేసి భూములు నమ్ముతూ రాష్ట్ర అభివృద్ధి చేయమనడం చట్టాన్ని దుర్వినిగా చేస్తూ వీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన ప్రభుత్వమే వారిని పట్టించుకోవడం మానేసింది ఈ సంఘటన పాల్పడిన టిఆర్ఎస్ నాయకులపై ప్రతి ఒక్కరిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే మరో పార్టీవారు మరో సమయంలో దాడులు చేసే అవకాశం ఉంటుంది కనుక సంయమనంతో వ్యవహరించి ప్రతి ఒక్కరి భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.