Tuesday, 3 November 2026

ఎయిడ్స్  పై అవగాహన ర్యాలీఎయిడ్స్  పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్  పై అవగాహన ర్యాలీఎయిడ్స్  పై అవగాహన ర్యాలీ
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 1): ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపాల్ పేట్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ నివారణ అందరి బాధ్యత ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ  విద్యార్థులు,ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్  క్లేవిన్ మార్క్ మాట్లాడుతూ”మనల్ని మనం పరీక్షించుకోవడం, హెచ్ఐవి ని అంతం చేయడానికి సమానతని సాధించడం అని పేర్కొన్నారు. ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు, అక్రమ లైంగిక సంబంధాల వలన కలిసిత రక్త మార్పిడి వలన ఎయిడ్స్ సంక్రమిస్తుందని పేర్కొన్నారు. చాప కింద నీరుల వ్యాపిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం మనందరి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని సమయంలో హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షిత, వైద్య సిబ్బంది సురేష్ కుమార్, సుచిత్ర, కౌసల్య, మధుబాబు, జ్ఞానేశ్వర్, నాగమణి, శోభ, పద్మావతి, కళాశాల అధ్యాపకులు రాజు, శేషయ్య, ఆశా కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.