వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారివరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (1): మండల కేంద్రంతో పాటు బుద్ధారం గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం జిల్లా సహకార అధికారి కాంతి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ 2060 బి గ్రేడ్ 2040 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం 14 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టాలని సూచించారు ధాన్యం విక్రయ డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రమేష్ బాబు, పి ఎ సి ఎస్ సీఈవో రామ్మోహన్ తదితరులు ఉన్నారు
వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారివరి




