Wednesday, 4 November 2026

ఎయిర్‌కోస్టా @ రూ.999

Air Costa Ticket Rs .999

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) : ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా హ్యపీ హోలీ పేరుతో ప్రత్యేక రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ టికెట్ ధర అన్ని పన్నులు కలుపుకొని రూ.999గా నిర్ణయించింది. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవనున్న ఈ ఆఫర్ మార్చి 3 మధ్యాహ్నం 12 గంటలకు ముగియనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారు వచ్చే నెల 15 నుంచి 30 సెప్టెంబర్ లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం మధ్య టికెట్ ధరను రూ.999గా నిర్ణయించిన సంస్థ, హైదరాబాద్-తిరుపతి, విశాఖపట్నం-తిరుపతి, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విశాఖపట్నం మధ్య రూ.1,499గాను, హైదరాబాద్-కోయంబత్తూర్, బెంగళూరు-విశాఖపట్నం మధ్య రూ.1,999గా నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *