Wednesday, 4 November 2026

వార్‌ వన్‌ సైడే

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) : ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు వరంగల్ ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు గులాబీదళానికి అండగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏకపక్ష ఫలితాలు రానున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నల్లగొండ కలెక్టరేట్ కు భారీ ర్యాలీగా బయల్దేరారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తుమ్మల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *