Friday, 6 November 2026

ఎయిర్‌కోస్టా సమ్మర్‌ ఆఫర్‌

73cms9r4ప్రాంతీయ విమాన సర్వీసుల కంపెనీ ఎయిర్ కోస్టా.. వేసవి సెలవులను పురస్కరించుకుని సమ్మర్ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రతి టికెట్ బుకింగ్ పై 999 రూపాయల డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 18 నుంచి 22 వరకు సమ్మర్ సేల్ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ కోస్టా వెల్లడించింది. ఆఫర్లో భాగంగా టికెట్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 15 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎకానమీ, ఎకానమీ ప్లస్ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. వేసవి సెలవుల కోసం ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ ను తీసుకువచ్చినట్లు ఎయిర్ కోస్టా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *