Tuesday, 3 November 2026

ఎయిర్‌హోస్టెస్‌తో బంగ్లా జాతీయుడి అసభ్య ప్రవర్తన

ముంబై: ఇండిగో విమానంలో ప్రయాణిస్తోన్న ఓ బంగ్లాదేశ్ జాతీయుడి విమానంలోని ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు విమానం ల్యాండ్ అవగానే నిందితున్ని అరెస్టు చేశారు. వివరాలు.. కోల్‌కటా నుంచి ముంబైకి వెళ్తోన్న విమానంలో బంగ్లా జాతీయుడు ఎయిర్ హోస్టెస్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే ఉన్న ప్రయాణికుడు వారించినా వినకుండా అదే విధంగా ప్రవర్తించడంతో ఎయిర్ హోస్టెస్ విమాన పైలట్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో పైలట్ ఎయిర్ కంట్రోల్ ద్వారా విమానాశ్రయ అధికారులకు సమాచారం చేరవేశారు. విమానం ముంబై ఎయిర్‌పోర్టులో దిగగానే భద్రతా సిబ్బంది నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని బంగ్లాదేశ్‌కు చెందిన అశిమ్ భుమిక్ (38)గా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *