Wednesday, 4 November 2026

ఎరుకల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఎరుకల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వేమనపల్లి,నవంబర్ 07,(జనంసాక్షి):

ఎరుకల ఆదివాసీలకు రెవెన్యూ పట్టా కలిగిన భూమిని తిరిగి ఇప్పించి మా ఎరుకల ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరుతూ
తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు ఉండాడి ఎల్లయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ అద్యక్షులు ఉండాడి రవి
మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ మధుసూదన్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్మల్ పేట గ్రామంలో ఎరుకల తెగకు చెందిన ఆదివాసీలు మూడు తరాలుగా నీల్వాయి శివారు లోని సర్వే నంబర్ 301 లో భూమి 2-05 ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బెదిరించి అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కున్నారని అన్నారు.రెవెన్యూ పట్టా కలిగి ఉన్న భూములను అటవీ అధికారులు లాక్కునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
వెంటనే అధికారులు స్పందించి మా కుటుంబాలకు న్యాయం చేయాలని లేనియెడల తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గంగయ్య,చిన్నన్న,సతీష్, సంతోష్,సతమ్మ,రాజేశ్వరీ,ఎల్లక్క,నాగేష్, దేవయ్య,శ్రీకాంత్,పోచక్క,సడవలి,పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.