Tuesday, 3 November 2026

ఎర్రన్నాయుడుకు నేతల నివాళి

శ్రీకాకుళం,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 6వ వర్ధంతి సందర్భంగా నిమ్మాడలో శుక్రవారం ఎర్రన్న ఘాటు వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర శివాజీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ కె ధనుంజయరెడ్డి, ఎస్పీ, జేసీ, కుటుంబ సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధులు, మరియు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.