Tuesday, 3 November 2026

జగన్‌కు భద్రత పెంచుతామన్న డిజిపి

 

విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడికత్తి దాడి నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు భద్రత పెంచుతాం అని రాష్ట్ర డిజిపి ఆర్‌.పీ ఠాకూర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ… విచారణలో భాగంగా జగన్‌ను రెండు సార్లు కలసి ఇన్వెస్టిగేషన్‌కు సహకరించమని అధికారులు కోరారు. మరొకసారి జగన్‌ ను అధికారులు విచారణ కోసం కలుస్తారు. నాయకులతో పాటుగా ప్రజలకు సహితం రక్షణ కల్పించడం డీజీపీగా నా బాధ్యత అని పేర్కొన్నారు. కోడికత్తి కేసు నిందుతుడిని తిరిగి కష్టడీలోకి తీసుకోవడం ఇన్వెస్టిగేషన్‌ అధికారి నిర్ణయం అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కవిూషన్‌ నుంచి ఎటువంటి నోటీసులు నాకు రాలేదు అని డీజీపీ ఠాకూర్‌ తెలిపారు.