గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 24 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాలోని కొత్తగా మండలం గా ఏర్పడిన ఎర్రవల్లి చౌరస్తాలో మండల కేంద్రం వద్దని ఇటిక్యాలనే ముద్దని ఎం బి చర్చిల చైర్మన్ టి. డానియల్ సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ల స్వలంబన కోసం, రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎర్రవల్లి చౌరస్తా మండలాన్ని ప్రకటించారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఎర్రవల్లి చౌరస్తా అభివృద్ధి చెందిందని, కానీ ఇటిక్యాల మండల కేంద్రము అభివృద్ధి చెందలేదని , ఇటిక్యాల మండల పరిధిలోని గ్రామాలకు 7 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని, గ్రామాలకు ఎర్రవల్లి చౌరస్తా దూరం అవుతుందని, ఇటిక్యాల మండలం ఉండాలని దీనిపై ప్రభుత్వం స్పందించి ఎర్రవల్లి చౌరస్తా మండలం రద్దు చేయాలని ఆయన కోరారు.




