Wednesday, 4 November 2026

బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి పలు పనుల నిమిత్తం వచ్చే బాటసారులు కోర్టు చౌరస్తా వద్ద సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుమన్ యువసేన జిల్లా అధ్యక్షులు గుండా వెంకన్న అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గుడిపాటి నాగేశ్వరరావు, విజయలక్ష్మిల పెళ్లిరోజు సందర్భంగా వారి సహాకారం తో బాటసారులకు చల్లని మంచినీరు,మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా   ఆయన మాట్లాడుతూ తన అభిమాన నటుడు సుమన్ పేరుతో గత ఏడేళ్ల నుండి మండు వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ చలివేంద్రానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రామయ్య, గోపారపు రాజు, బొల్లం సురేష్, బోనగిరి విజయకుమార్,గుడిపాటి రమేష్, బుర్లే రాజు తదితరులు పాల్గొన్నారు.