Thursday, 5 November 2026

సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినసింగిల్ విండో డైరెక్టర్శ్రీనివాస్ రెడ్డి

 

 

 

 

 

 

వీణవంక  ఏప్రిల్ 24 (జనం సాక్షి) వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని   సింగిల్ విండో  డైరెక్టర్ చెక్క బండి శ్రీనివాస్ రెడ్డి   సోమవారం రెడ్డిపల్లి లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రాంరంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నేరుగా  ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార సంగం వరి ధాన్యం  కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి  మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల నర్సయ్య, ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మి భూమయ్య,  సీఈవో ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మాడ విజేందర్ రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ కట్ట కుమారస్వామి, వార్డు సభ్యులు మాడ రవీందర్ రెడ్డి, గట్టు కుమార్, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.