గద్వాల నడిగడ్డ, మే (జనం సాక్షి);మేడే సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టి ఎస్ ఇ ఇ 327యూనియన్ (ఐఎన్టియుసి) యూనియన్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు దేవేంద్ర,ఉదయ్,వెంకట్ రాముడు,అంజనైలు,పురుషోత్తం,మురళి,అశోక్ లు మాట్లాదుతు మేనేజ్మెంట్ కార్మికుల పట్ల వ్యతిరేకమైన వైఖరిని మానుకొని యాజమాన్యం శ్రమదోపిడి చేయకుండా సమాన పనికి సమాన వేతనం కార్మికులకు రావలసిన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, నాగరాజు, నగేష్,పరశురాముడు, గురునాథ్, పరమేష్, షకీల్, ఈశ్వర్, విటల్ మొదలైన వారు పాల్గొన్నారు.




