పెద్దఅడిషర్లపల్లి మే 1(జనంసాక్షి):తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆదేశం మేరకు ఈ రోజు దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ వస్కుల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పి. ఏ.పల్లి మండలం లోని అజ్మపురం గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు,తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఎకరాకు 20 వేలరూపాయలు తక్షణం అందజేయాలని తెలిపారు ,ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు సీత సీతారాములు , మండల సీనియర్ నాయకులు బూడిద వెంకటయ్య,గుండాల అంజయ్య, ఇరగ దిండ్ల యాదయ్య, దోతుల కొండల్, తదితరులు పాల్గొన్నారు.




