Monday, 2 November 2026

ఎలాంటి నిర్ణయమైన నేతలంతా కట్టుబడి ఉండాలి: దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలంతా కట్టుబడి ఉండాలని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు వ్యాపారాలు చేయకూడదని ఒకవేళ వ్యాపారాల్లో ఉంటే మానుకోవాలని అన్నారు. రాజశేఖర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలుండేవని చెప్పారు. జగన్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడైనా వ్యక్తిత్వంలో వారిద్దరికీ చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో కోర్‌కమిటీ ముందుకు సీఎం, బొత్స, ఆజాద్‌లతో కలిసి తానూ హాజరవుతానని, సభ్యులకు తమ అభిప్రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *