Tuesday, 3 November 2026

ఎలాంటి విచారణకైనా సిద్దం: తెరాస

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తే చూస్తూ వూరుకోమని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. తెలంగాణ కోసం అమరులైన వారి మరణ వాంగ్మూలాలను రేపు బయట పెడతామన్న తెరాస ఎమ్మెల్యే… అందులో తమ పేర్లు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. తెదేపా నేతల పేర్లు ఉంటే శిక్షకు సిద్ధమేనా అని సవాల్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *