ఎల్కతుర్తి జూన్ 8 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలలో కట్ట మైసమ్మ వేడుకలు బోనాలు ఘనంగా నిర్వహించారు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దామెర చింతలపల్లి ఎల్కతుర్తి గోపాల్పూర్ ఆరేపల్లి పలు గ్రామాలలో కట్ట మైసమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు నిండు వేసవికాలంలో కూడా మన చెరువులలో నీరు ఉండేందుకు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనుల వల్ల నీరు పుష్కలంగా ఉన్నందున దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కట్ట మైసమ్మ వేడుకలు నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అసిస్టెంట్ కలెక్టర్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎంపీపీ మేకల స్వప్న సర్పంచులు ఎంపీటీసీలు మహిళా సంఘం సిఏలు గ్రామ ప్రజలు యువకులు బోనాలతో బతుకమ్మలతో ఉత్సవంగా పాల్గొన్నారు
ఎల్కతుర్తి మండలంలో ఘనంగా కట్ట మైసమ్మ వేడుకలు పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్




