Wednesday, 4 November 2026

చెరువులు పునరుద్ధరణ  తో ప్రతి గ్రామం సిరిసంపదలతో తులతూగుతుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి 

 

 

–

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 9 :-

–-;చెరువులు పునరుద్ధరణ  తో ప్రతి గ్రామం సిరిసంపదలతో తులతూగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి  ఐఏఎస్   అన్నారు.

-; గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో  భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని  చిన్నాపూర్ గ్రామం లో ఊరు రా చెరువుల పండగ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

-;  ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో  వివిధ హోదాలలో విధులు నిర్వహించానన్నారు 

-;జిల్లా లోని ప్రతి గ్రామం రెండు మూడుసార్లు  విజిట్ చేశాను.నాడు ఉమ్మడి   మెదక్ జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో  కరువు కాటకాలు  ఉండేది, త్రాగు సాగునీటి సమస్య ఉండేది, ఎడ్లబండ్లతో తాగునీరు ఏర్పాటు చేసేవాళ్లం,బోర్ వేయించాలంటే జియాలజిస్ట్ ల సమస్యలు ఉండేవి

-; నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం   మిషన్ కాకతీయ కార్యక్రమం  ద్వారా  చెరువుల పునరుద్ధరణ జరిగింది.

-;తద్వారా తూములు అలుగులు బాగు చేసుకున్నారు. ఇప్పుడు మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా అయింది.

-;ఒక్క సంగారెడ్డి జిల్లాలో నే రెండు లక్షలు టన్నులు వరి ధాన్యం పండిందంటే  ఆశ్చర్యమేసింది.

 -;వేసవిలో కూడా చెరువులు నిండుకుండలాదర్శనమిస్తున్నాయి

 -;ఇది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన విధానం ద్వారా  వ్యవసాయం ఒక పండగల సాగుతుంది.

 

 -;ఊరురా చెరువుల పండుగకు రెండు గ్రామ వాళ్ళ ప్రజలు  వచ్చి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.

 -;ఇది ప్రజల విజయం,  ఈ దశాబ్ది  ఉత్సవాలు మిగిలిన 14 రోజులు  ప్రతిరోజు పండగలజరుపుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు.

 

 -;జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  నాడు లో  జిల్లాలో 13 వేల   ధాన్యం పండితే  నేడు రెండు లక్షల పదివేల  మెట్రిక్ టన్నుల  ధాన్యం పండింది. మిషన్ కాకతీయ, మిషన్ ద్వారా సాధ్యమైంది అన్నారు.

  -; జిల్లాలో త్రాగునీటికి సాగినీటికి  ఇబ్బందులు లేవని తెలిపారు , రెండు పంటల తర్వాత కూడా చెరువులు కళకళలాడుతున్నాయన్నారు.

అంతకుముందు చెరువుల పండగకు  వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ని  కంది చిన్నాపూర్ గ్రామ  ఆడబిడ్డలు  బతుకమ్మలతో స్వాగతం పలికారు , అనంతరం  కంది గ్రామం నుండి చింన్నాపూర్ చెరువు వరకు  మంగళ బాజాలతో బతుకమ్మలు గౌరమ్మల, పోతురాజులు, జాలర్ల ప్రదర్శనలతో, కోలాటాలు,డబ్బుల  చెప్పుల్లతో, కట్ట మైసమ్మ అమ్మవారి టెంపుల్ వరకు  ఊరేగింపుగా ఊర పండగ సాగింది. కట్ట మైసమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కట్టమైసమ్మ గుడి వద్ద  మొక్కలను నాటారు. చెరువులో గంగాదేవి అర్చనా, గణపతి పూజ , మహా మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు   .  అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని గ్రామ ప్రజలు గజమాలతో సన్మానించారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు కూడా ప్రధాన కార్యదర్శిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్లింగ్ చైర్మన్  చింత ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్  మంజుశ్రీ జయపాల్ రెడ్డి,  గ్రంథాలయ చైర్మన్ నరహరి,SP రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పిటిసిలు ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు,  ప్రజా ప్రతినిధులు,సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.