ఎల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
ఝరాసంగం( జనం సాక్షి): ఎల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితంతువు మహిళల కు దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ మొరంగి పల్లి జైపాల్ తెలిపారు. శుక్రవారం సంస్థ ప్రతినిధుల తో కలిసి తుమ్మన్ పల్లి కమాల్ పల్లి వనంపల్లి, కప్పడ్ గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 2న ఝరాసంగం లోని స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. ఈ అవకాశం ను మండలం లోని ఆయా గ్రామాల్లోని వితంతువు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు స్వామిదాస్, ప్రేమ్ సంతోష్ కుమార్ ,నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
ఎల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ




