నిరుపేద కుటుంబానికి తమ సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి, ప్రారంభించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి డిసెంబర్ 30 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రం చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని డియంకుంట గ్రామంలో నిరుపేద అయిన యేకుల అనంతరాములు కుటుంబానికి కొండమల్లెపల్లి ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్ రెడ్డి తమ సొంత డబ్బులతో నిర్మించిన ఇంటిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపిపి రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు గౌరవంగా బ్రతకాలని, పేద ప్రజలకు సహాయం చేయడం ఎంతో ఇష్టమని భగవంతుడు మాకు ప్రసాదించిన కొంతలో నిరుపేదలకు పక్క గృహం నిర్మించి ఇచ్చామని పేద ప్రజలు సంతోషంగా ఉండడమే ముఖ్యమని తమ సొంత నగదు తో నిర్మించి ఇచ్చిన గృహాన్ని ప్రారంభించి వారితో గృహప్రవేశం చేశారు ఎన్నో ఏళ్లుగా తమకు సొంత ఇల్లు లేని మాకు ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి మాకు చేయూతనిచ్చి మమ్మల్ని గౌరవించి మాకు సొంత ఇంటి కలను సహకారం చేసిన ఎంపీపీ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు ఇలా పేద ప్రజలకు పక్క గృహాన్ని నిర్మాణం చేసి ఇచ్చిన ఎంపీపీ దంపతులకు మండల కేంద్రంలోని పలు ప్రజా సంఘాలు, రైతు సోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి మంచి చేసే మహానుభావులు సమాజానికి చాలా అవసరం అని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచులు యేకుల సురేష్, మంగ్య నాయక్, యువజన నాయకులు పెద్దిశెట్టి మహేందర్, నాగేంద్ర బాబు, రావుల ముత్యాలు, ప్రవీణ్, ఆనంద్, విష్ణు, ప్రభు తదితరులు పాల్గొన్నారు
నిరుపేద కుటుంబానికి తమ సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి, ప్రారంభించిన కొండమల్లేపల్లి ఎంపీపీ




