జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.
ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 30, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో శుక్రవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 149వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం గాజుల శౌర్య తేజ పుట్టినరోజు సందర్బంగా వారి తల్లిదండ్రులు గాజుల లావణ్య కైలాష్ దంపతులు న్యూ వెంకటేశ్వర వెటర్నరీ మెడికల్ బెల్లంపల్లి సహకారంతో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 250 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు గాజుల లావణ్య కైలాష్, శౌర్య తేజ, శాన్విక, జోరిగెల రాధ, సతీష్, శివ జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కొడిపెల్లి గిరి ప్రసాద్, సహాయ కార్యదర్శులు పతంగి సంతోష్, దాసరి రంజిత్ గౌడ్, సభ్యులు పాయవేణి మల్లేష్, ఆడే సురేందర్, నిచ్చకోలా గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.




