వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 2
జనసంద్రం మధ్య అంగరంగ వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల రథోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.గురువారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.రథాన్ని పచ్చటి తోరణాలు,రంగు రంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి రథంపై శ్రీ పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను ఉంచి భక్తులు రథాన్ని లాగుతూ గ్రామస్తులు నిండు బిందెలతో నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.ఈ రథోత్సవ మహోత్సవానికి వందలాదిగా భక్తులు తరలివచ్చి ఆ ఆది దంపతులకు నిలయమైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల దేవాలయంలో వారికీ దర్శించుకోవడం జరిగింది.ఈ రథోత్సవ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
ఎల్లకొండలో వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల రథోత్సవ మహోత్సవం




