Tuesday, 3 November 2026

ఎల్లలు దాటిన ప్రేమ

 

 

 

 

 

మయన్మార్ దేశం అమ్మాయితో గుడిహత్నూర్ మండల అబ్బాయి వివాహంగుడిహత్నూర్: ఫిబ్రవరి 6( జనం సాక్షి).. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు ప్రేమికులు మండలానికి చెందిన అబ్బాయి మయన్మార్ కు చెందిన అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్ళి తో ఒకటయ్యారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగుడలో సోమవారం సెయింట్ థామస్ చర్చిలో గొల్లపల్లి రవి కుమార్, మయన్మార్ కు చెందిన జిన్ న్వే థెన్ ల వివాహం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఘానంగా జరిగింది గొల్లపల్లి రవి కుమార్ ఆరు సంవత్సరాల క్రితం ఖాతర్ దేశానికి వెళ్ళాడు రవి కుమార్ ,మయన్మార్ కు చెందిన జిన్ న్వే థేన్ దోహా నగరంలోని హోటల్ మేనేజ్మెంట్ లో పని చేసే వారు ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు ఈ పెళ్ళికి అమ్మాయి తరపున ఆమె సోదరుడు కేవ్ థియేన్ హాజరయ్యాడు వివాహానికి హాజరైన వారు ఇద్దరిని ఆశీర్వదించారు