◆నీళ్లు, నిధులు గురించి మాట్లాడే హక్కు షర్మిలకెక్కడిది….. ? తెలంగాణలో ఫలితం లేని పాదయాత్రలా….?◆కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన షర్మిలకు ప్రథమ చికిత్స కిట్ పంపించిన రామకృష్ణారావుపత్రికా సమావేశంలో నిప్పులు చెరిగిన జీవీఆర్మానకొండూరు ఆర్ సి, జనవరి 6 (జనం సాక్షి)భారత రాష్ట్ర సమితి పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అనుచిత, అసంబద్ధ, అర్థరహిత వ్యాఖ్యలు తక్షణం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గూడూరు వీర వేంకట రామకృష్ణారావు హెచ్చరించారు. మొదటి విడత పాదయాత్రలో తెలంగాణ వాదులను, బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి పై షర్మిల చేసిన అనుచిత, అనైతిక ప్రేలాపనలపై తెలంగాణ వాదులు ఇచ్చిన ట్రీట్మెంట్, పరాభవం షర్మిల అప్పుడే మర్చిపోయారా అని ఎద్దేవ చేశారు. షర్మిల మొదటి విడత పాదయాత్రలో 300 కిలోమీటర్ల మేర సంయమనం పాటించామని తేల్చి చెప్పారు. హైదరాబాదులోని ముఖ్యమంత్రి ఇంటిముందు నిరసనకు దిగితే కారుతో సహా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషనకు తరలించి కేసు నమోదు చేసినా షర్మిల నేటి వరకు రాజకీయ పరిణితిని సాధించలేకపోయారని విమర్శించారు. సోమవారం భారాస పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గూడూరు వీర వెంకట రామకృష్ణారావు మానకొండూరు లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ , ముంజంపల్లి సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పిట్టల కవిత, నాయకులు శాతరాజు యాదగిరి, పిట్టల మధు ,గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్, తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై ఆయన నిప్పులు చెరిగారు. రెండవ విడత పాదయాత్రలో అభివృద్ధి, ప్రాజెక్టులు పై ఆమె మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ గడ్డకు షర్మిల కు ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు. కడప జిల్లా వాసి షర్మిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కడపలో పాదయాత్ర చేయాలని సూచించారు. తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో పాదయాత్ర చేయటం ఏమిటని ప్రశ్నించారు. కే సీ ఆర్ ప్రగతి భవన్ వీడి ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి కి షర్మిల స్పోర్ట్స్ షూస్ ను పంపడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యమ నాయకునికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని షర్మిల గ్రహించాలన్నారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తదితర ప్రజా సంక్షేమ పథకాలు కెసిఆర్ తోనే సాధ్యమయ్యాయని షర్మిల ఈ విషయం గ్రహించి వాస్తవాలు పరిశీలించి మాట్లాడాలని హితువు పలికారు. లక్ష్మణ రేఖ దాటితే మహిళా అని చూడకుండా తెలంగాణ వాదులు షర్మిలను వెలి వేయడం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ఎంత సమయమనం పాటించినా అంతకంతకు షర్మిల రెచ్చిపోయి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల పాదయాత్రలో ఎప్పుడైనా తెలంగాణ వాదులపై, చిల్లర మల్లర మాటల తో వారిని రెచ్చగొడితే షర్మిలను తెలంగాణ పోలీసులు సురక్షితంగా గమ్యం చేరుస్తారు కానీ, జరగరానిది ఏదైనా దుస్సంఘటన జరిగితే ముందు జాగ్రత్త చర్యగా షర్మిలకు ప్రథమ చికిత్సాకిట్ ను భారత రాష్ట్ర సమితి పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన పంపిస్తున్నామన్నారు. మీడియా సాక్షిగా కిట్టును షర్మిల కు పంపించారు.




