Wednesday, 4 November 2026

ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులను నిర్వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరయ్య

ఎల్లారెడ్డి 03 జూన్ (జనం సాక్షి ) కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనరసయ్య ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో న్యాయ సేవా సదన్ డివిజనల్ పోలీస్ అధికారులకు ఎల్లారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరయ్య శిక్షణ తరగతులు నిర్వహించి ఎఫ్ ఐ ఆర్ నుండి చార్జి షీట్ లో జరుగుతున్న లోపాలను నివారించి కేసులలో నేరస్తులను శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలని గోప్యంగా వ్యవహరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఇట్టి సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్లు ఎల్లారెడ్డి ఎస్ఐ గణేష్, నాగిరెడ్డిపేట్ ఎస్ఐ ఆంజనేయులు, గాంధారి ఎస్ఐ వి సుధాకర్, లింగంపేట్ ఎస్ఐ డి. శంకర్ లతో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.