గంగారం జూన్ 3 (జనం సాక్షి)తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు గ్రాండ్ గా నిర్వహిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. జూన్ 2 నుంచి 21వ తేదీ వరకు ఏయే రోజు.. ఏయే అంశంపై ప్రోగ్రాం ఉంటాయనేది వెల్లడించింది. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడంతో పాటు సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారు.
మూడో తారీఖున రైతు దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు ముందుగా ఈ రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అంటే రాష్ట్రంలో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కెసిఆర్ దుడ సంకల్పం కి నిదర్శనం కానీ ప్రభుత్వం రైతుల కోసం లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసి రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలను రైతులకు అవగాహన కల్పించడం కోసం జూన్ మూడో తారీఖున రైతు వేదికలలో వివరించాలని మండల అధికారులకు సూచించినప్పటికీ కమట్లాగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధలోని గ్రామాలలో రైతులకు ఎలాంటి దండోరా వేయించకుండా సరైన సమయం కూడా తెలపకుండా రైతులు రాకముందుకే సమావేశాన్ని ముగించారు. ఇలా ఎందుకు చేశారని స్థానికంగా ఉన్న రైతులు అడగగా వారికి ఇలాంటి సమాధానం చెప్పకపోవడంపై స్థానిక రైతులు తీవ్రంగా విమర్శించారు. రైతులు రైతు వేదికకు అవగాహన కోసం వచ్చినట్లు లేదని అన్నం పెడితే తిని పొమ్మన్నట్టున్నదని వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత గంగారం మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఏఈఓ లకు సరైన సమాచారం అందివ్వకపోవడమే కారణమని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కోసమా లేక విందు భోజనాల కోసమా?




